పర్మిషన్‌ లేకుండా క్రషర్‌ నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పర్మిషన్‌ లేకుండా క్రషర్‌ నిర్వహణ

Jul 22 2026 9:00 AM | Updated on Jul 22 2026 9:00 AM

కేశంపేట: మైనింగ్‌ శాఖ అనుమతులు వచ్చే వరకు క్రషర్‌ పనులు చేపట్టవద్దని ఆర్‌ఐ చెన్నకేశవ ఆర్కాన్‌ మినరల్స్‌ క్రషర్‌ నిర్వాహకులను హెచ్చరించారు. వివరాలు.. వేములనర్వ గ్రామంలోని ఆర్కాన్‌ మినరల్స్‌ క్రషర్‌ మిషన్‌ లీజు పర్మిషన్‌ అనుమతి గడువు ముగిసిన నిర్వహకులు రాళ్లను తవ్వి కంకర తయారు చేస్తున్నట్టు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌ఐ చెన్నకేశవ మంగళవారం క్రషర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్రాలను పరిశీలించి గడువు ముగిసినట్లు గుర్తించారు. గడువు పొడగింపునకు ప్రభుత్వానికి చలానా చెల్లించామని నిర్వాహకులు తెలిపారు. మైనింగ్‌ శాఖ నుంచి అనుమతి వచ్చే వరకు అన్ని పనులు నిలిపివేయాలని హెచ్చచరించారు. కంకర్‌ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్‌ను నిలిపి కంకరను అన్‌లోడ్‌ చేయించారు. ఆర్‌ఐ వెంట జీపీఓ రాజేశ్వరి, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

పనులు నిలిపివేయించిన రెవెన్యూ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement