ఆలయ భూముల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చర్చనీయాంశంగా మారాయి. ఆదాయ వృద్ధి కోసం చేట్టిన ఈ నిర్మాణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. | - | Sakshi
Sakshi News home page

ఆలయ భూముల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చర్చనీయాంశంగా మారాయి. ఆదాయ వృద్ధి కోసం చేట్టిన ఈ నిర్మాణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

26 దుకాణాలపై ఉత్కంఠ

తాండూరు: దేవాలయ ప్రాంగణాలు, మాన్యాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. గతంలో పచ్చని చెట్లు, ఆధ్యాత్మిక వాతావరణంతో వెల్లివిరిసిన ఈ ప్రాంతాల్లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపట్టారు. స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం బస్వన్న కట్ట ప్రాంతంలో పూర్తయిన షాపింగ్‌ కాంప్లెక్స్‌, రెండేళ్ల క్రితం భావిగి భద్రేశ్వరాలయ ప్రాంగణంలో చేపట్టిన కాంప్లెక్స్‌ నిర్మాణాల్లో దుకాణాల ఏర్పాటు చేసుకునేందుకు స్థానికుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు నుంచి స్టే రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం పోట్లి మహరాజ్‌ ఆలయ ప్రాంగణంలోని చెట్లు, ఇళ్ల నిర్మాణాలను కూల్చి వ్యాపారుల నుంచి ఒక్కో దుకాణానికి రూ.పది లక్షల చొప్పున వసూళ్లు చేపట్టి నిర్మణాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సిన అధికారులే ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోర్టు స్టేతో పనులకు బ్రేక్‌

భావిగి భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల సమయంలో బాలాజీ మందిర్‌ ఎదుట ఖాళీ స్థలంలో పశువుల సంత నిర్వహించేవారు. 2017లో ఆలయాధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ స్థలంలో 20 దుకాణాలతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. కాగా పట్టణానికి చెందిన కల్వ శంకర్‌ కుటుంబ సభ్యులు తమ స్థలంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారంటూ కోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో స్టే వచ్చింది. దుకాణాలు అప్పగించకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావిగి భద్రేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న కాంప్లెక్స్‌ పనులు అడ్డుకోవాలని ఆరు నెలల క్రితం వీరశైవ సమాజం ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ నిర్మాణాలను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దుకాణాల కోసం డబ్బులు చెల్లించిన 46 మంది బాధితులు ఆందోళన చెందుతున్నారు.

ఆలయాల భూములకు

వ్యాపార గోపురం

వివాదాస్పదంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌లు

నిర్మాణాలు నిలిపివేయాలంటూ కోర్టు స్టే

దుకాణాలు కేటాయించేందుకు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు

ఆందోళనలో బాధితులు

రెండెకరాల్లో పొట్లీ మహరాజ్‌ ఆలయ ప్రాంగణం విస్తరించి ఉంది. గతంలో పాఠశాల భవనం నిర్మించారు. రెండు నెలల క్రితం ఆలయ ప్రాగణంలోని చెట్లు, పేద కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను కూల్చేసి 26 దుకాణాల ఏర్పాటుకు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇక్కడ ఒక్కో దుకాణం కోసం రూ.పది లక్షల నుంచి రూ.15లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆలయంలో నిర్మిస్తున్న దుకాణాలు వ్యాపారుల చేతికి అందుతాయా.. లేదంటే న్యాయపరమైన చిక్కులతో నిలిచిపోతాయా అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement