ట్రైలర్‌ లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి.. | - | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి..

Jul 19 2026 6:53 AM | Updated on Jul 19 2026 6:53 AM

ట్రైలర్‌ లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి.. ద్విచక్ర వాహనాల చోరీ ముఠా అరెస్ట్‌

అదుపుతప్పిన డీసీఎం

కొత్తూరు: వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఓ డీసీఎం ట్రైలర్‌ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం మున్సిపల్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ శివారులో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన క్రారం.. కొత్తూరు నుంచి శంషాబాద్‌ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ డీసీఎం ముందు వెళ్తున్న ట్రైలర్‌ లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి వెనుక నుంచి ఢీకొట్టింది. అదే సయమంలో వెనుక నుంచి వస్తున్న కారు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదు. కాగా ప్రమాదం కారణంగా వాహనాలు రోడ్లపై నిలిచి రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది.

52 బైక్‌లు స్వాధీనం

కందనూలు: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన దొంగల ముఠా పట్టుకున్న పోలీసులు రిమాండ్‌ తరలించారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాత పోలీస్‌స్టేషన్‌ మీటింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ మాట్లాడుతూ.. బైక్‌ల చోరీ ఘటనలో నిందితులు పిట్టల చరణ్‌కుమార్‌, జంగం యాదయ్య, చింతకాయల కృష్ణంరాజును అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. ప్రధాన సూత్రధారి అయిన సంతోష్‌నాయక్‌ ఇప్పటికే మరో కేసులో అరైస్టె మహబూబ్‌నగర్‌ జైలులో ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం 52 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 25 ఏళ్ల వయసు ఉన్న యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి.. ఈజీ మనీ కోసం హ్యాండిల్‌ లాక్‌ వేయకుండా ఇళ్ల ముందు, రోడ్ల పక్కన పార్క్‌ చేసిన బైకులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారని విచారణలో బయటపడిందన్నారు. మహబూబ్‌నగర్‌లో 20, సైబరాబాద్‌లో 14, హైదరాబాద్‌లో 4, వనపర్తిలో 3, షాద్‌నగర్‌ ఫ్యూచర్‌ సిటీలో 1, యాదాద్రి జిల్లాలతో 3 బైకులతో పాటు నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు చోరీకి గురైన బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దోచుకున్న వాహనాలను బిజినేపల్లి మండలంలోని ఆయా గ్రామాల రైతులు, సామాన్యులకు తక్కువ ధరకు విక్రయించినట్లు పేర్కొన్నారు. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన 26 మంది పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమానులు తప్పనిసరిగా హ్యాండిల్‌ లాక్‌ వేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్‌, శంషుద్దీన్‌, పోలీస్‌ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement