మరకత శివాలయంలో ప్రసన్నకుమార్‌ రెడ్డి పూజలు | - | Sakshi
Sakshi News home page

మరకత శివాలయంలో ప్రసన్నకుమార్‌ రెడ్డి పూజలు

Jul 19 2026 6:53 AM | Updated on Jul 19 2026 6:53 AM

మరకత శివాలయంలో ప్రసన్నకుమార్‌ రెడ్డి పూజలు ఒకే లక్ష్యం.. ఒకే మార్కులు

శంకర్‌పల్లి: మండల పరిధిలోని చెందిప్ప మరకత శివాలయాన్ని శనివారం ఏపీ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కుమార్‌యాదవ్‌ మాజీ మంత్రికి శేషవస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. పురాతన మరకత శివాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రశాంత్‌, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

నీట్‌లో అక్కాచెల్లెళ్ల అరుదైన ఘనత

కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు నీట్‌–2026లో అద్భుత ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన కమ్మరి రమేశ్‌చారి, అనిత దంపతులకు కుమార్తెలు వైష్ణవి, రక్షిత. యాచారం మండలం కడ్తాల్‌ గురుకుల పాఠశాల, కళాశాలలో వారిద్దరిని ఇంటర్మీడియట్‌ వరకు చదివించారు. వారు నీట్‌లో మొదటి ప్రయత్నంలో విఫలం చెందారు. తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇరువురికి హైదరాబాద్‌లో కోచింగ్‌ ఇప్పించారు. ఇటీవల విడుదలైన నీట్‌ ఫలితాల్లో అక్కాచెల్లెళ్లు 514 మార్కులను సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement