మంచాల: ప్రభుత్వ పాఠశాలలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్ పనిచేస్తోందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజార్దుదీన్ అన్నారు. మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్)ను శనివారం ఆయన సందర్శించారు. తరగతి గదులు, గ్రౌండ్, కిచెన్, గ్రంథాలయాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో టీపీఎస్‌లో అత్యాధునిక విద్యావాతావరణం, క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. టీపీఎస్ దేశానికే రోల్‌మోడల్‌గా నిలవనుందని తెలిపారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. దురలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, డీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటప్రసాద్, ఎంపీడీఓ వసంత లక్ష్మి, ఎంఈఓ రాందాస్, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాములు, టీపీఎస్ హెచ్‌ఎం గిరిధర్‌గౌడ్, గ్రామ పాలకవర్గం, విద్యా కమిటీ సభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణు వర్ధన్‌రెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాస్, చంద్రయ్య, మాసయ్య, ఎల్లేశ్, జంగయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
పభుత్వ అవకాశాలను
సద్వినియోగం చేసుకోవాలి
కష్టపడి చదివి,
ఉన్నత శిఖరాలకు చేరాలి
ప్రతిఒక్కరూ దేశభక్తిని
పెంపొందించుకోవాలి
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి
మహ్మద్ అజారుద్దీన్


