‘భూ భారతి’ బాగుంది | - | Sakshi
Sakshi News home page

‘భూ భారతి’ బాగుంది

Jul 19 2026 6:47 AM | Updated on Jul 19 2026 6:47 AM

కితాబిచ్చిన మహారాష్ట్ర తహసీల్దార్ల బృందం

శంకర్‌పల్లి తహసీల్‌ కార్యాలయంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌

శంకర్‌పల్లి: రాష్ట్రంలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్‌ స్థానంలో ప్రవేశపెట్టిన భూ భారతి విధానంపై అధ్యయనం చేసేందుకు శనివారం మహారాష్ట్రకు చెందిన తహసీల్దార్ల బృందం శంకర్‌పల్లిలో పర్యటించింది. భోపాల్‌కు చెందిన 35 మంది తహసీల్దార్‌ బృందానికి శంకర్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో చేవెళ్ల ఆర్డీఓ పార్థసింహారెడ్డి, చేవెళ్ల తహసీల్దార్‌ కృష్ణయ్య పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. భూ భారతి పోర్టల్‌ ద్వారా భూ సమస్యల శాశ్వత పరిష్కారం, డిజిటల్‌ టైటిల్స్‌ సులువుగా సేవలు అందిచే పద్దతులను వారికి వివరించారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం వెంటనే భూమి బదిలీ అవుతున్న విధానాలను చెప్పారు. పోర్టల్‌లో సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ల బృందం భూ భారతి పోర్టల్‌ అద్భుతంగా ఉందని తమ రాష్ట్రంలోనూ ఈ తరహా పోర్టల్‌ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement