ఇబ్రహీంపట్నం రూరల్: వికసిత్ భారత్ ఆశయ సాధనకు యువత దోహదపడాలని అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ‘మై భారత్–వికసిత్ భారత్ యువజన నమోదు’ అవగాహన ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యువత మైభారత్ పోర్టల్‌లో చురుగ్గా నమోదు చేసుకోవాలని, స్వచ్ఛంద సేవ, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వం, దేశ నిర్మాణం కోసం అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా యువత నమోదు, భాగస్వామ్యాన్ని గరిష్ఠ స్థాయికి చేర్చడమే ప్రచార లక్ష్యమని తెలిపారు. అర్హులైన యువతకు అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థలు, యువజన సంఘాలు, వలంటీర్లను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ ఆయాలకు నియామకపత్రాలు
సామాజిక సేవే లక్ష్యంగా అంగన్‌వాడీ సిబ్బంది పని చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. గురువారం కలెక్టర్ నారాయణరెడ్డి ఉత్తర్వుల మేరకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ హెల్పర్లకు అంగన్‌వ్వాడీ టీచర్లుగా పదోన్నతి కల్పించారు. అనంతరం ఎనిమిది మంది అంగన్‌వాడీ ఆయాలకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలో ఖాళీ అవుతున్న అంగన్‌వాడీ టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శాంతిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.


