యాచారం: సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్‌సిటీ భద్రత మనపైనే ఉందని, శాంతి భద్ర తల నిర్వహణలో రాజీపడొద్దని మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి సూచించారు.కుర్మిద్దలో ఉన్న హై దరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణాను గురువారం ఆ యన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీ లించి, రిజిస్టర్లు, కేసుల దర్యాప్తు పురోగతి,పెండింగ్ కేసుల స్థితి, శాంతిభద్రతల నిర్వహణ, బీట్ వ్య వస్థ, నేర నియంత్రణ చర్యలుపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తరచూ ఈ ప్రాంతంలో సీఎం రేవంత్‌రెడ్డితో సహా మంత్రులు,ఉన్న తాధికారుల పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంత రం సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి స మస్యలు, కల్పించాల్సిన సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు సునీల్‌కుమార్, సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.


