శంకర్‌పల్లి: షోటోకాన్ కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన మండలంలోని రావులపల్లి కలాన్‌కి చెందిన మహ్మద్ రహీమ్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురువారం పీసీసీ అధ్యక్షుడు, కరాటే–డో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ని మర్యాదపూర్వకంగా కలిశాడు. గత ఏప్రిల్ 26న గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గచ్చిబౌలిలో మాస్టర్స్ ఆఫ్ జపాన్ షోటోకాన్ కరాటే పోటీలు నిర్వహించారు. ఇందులో మహ్మద్ రహీమ్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఫలితాలు అదే నెలలోనే ప్రకటించినప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ఫలితాలకు సంబంధించిన వీడియోలను ఇంగ్లాండ్‌లో ఉన్న ఉన్నతాధికారులకు చూపించారు. వారు గురువారం అధికారికంగా ధ్రువీకరణ పత్రం, మెడల్ పంపించారు. ఈ క్రమంలో రహీమ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.


