విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jul 17 2026 7:27 AM | Updated on Jul 17 2026 7:27 AM

● బాబునాయక్‌ తండాలో ఘటన

బషీరాబాద్‌: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని బాబునాయక్‌ తండా లో గురువారం చోటు చేసుకుంది.పోలీసు లు,స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు జెర్పుల రాములు నాయక్‌(51) ఉదయం పొలంలో బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంతో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎర్త్‌ వైర్‌ తగిలి పడిపోయాడు. గమనించి న స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాములు నాయక్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య సుశీలబాయి, కుమారులు బాబు, నితిన్‌, కుమార్తె భూమిక ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తాండూరు జిల్లాఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement