ఇబ్రహీంపట్నం: తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు, సిబ్బందికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజాతంత్ర మహిళా సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి భవనాన్ని కూల్చివేసి తాత్కాలికంగా మున్సిపల్ కార్యాలయ పాత భవనంలో కొనసాగుతున్న ఆస్పత్రి పనితీరును ఆ సంఘం నేతలు గురువారం సర్వే చేశారు. ఆరుగురు డాక్టర్లుతో 19 మంది వైద్య సిబ్బంది ఉన్న పేషెంట్లకు సరైన వైద్యం అందించడం ఇబ్బందికరంగా మారిందన్నారు. అత్యవసర కేసులు వస్తే నగరానికి రెఫర్ చేస్తుండటంతో పేదలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. సరైన సౌకర్యాలు కల్పించాలని, నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ సర్వేలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు విజయమ్మతోపాటు ఉన్నిసా బేగం, భూదేవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ సర్వే


