చదువుతోనే పేదరికం మాయం | - | Sakshi
Sakshi News home page

చదువుతోనే పేదరికం మాయం

Jun 8 2026 10:17 AM | Updated on Jun 8 2026 10:17 AM

యాచారం: చదువుతోనే పేదరికం మాయమవుతుందని, ఆ దిశగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కష్టపడి చదవాలని బీఆర్‌ఎస్‌ నేత క్యామ మల్లేశ్‌ సూచించారు. ట్రిపుల్‌ ఐటీలో సీట్లు సాధించిన యాచారం మండలం గడ్డమల్లయ్యగూడం గ్రామానికి చెందిన గౌర జాహ్నవి, మంచాల మండల కేంద్రానికి చీర మనస్వినిలను నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా సత్కరించారు. తలా రూ.పది వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం మాయం కావాలన్నా.. ప్రజల్లో గుర్తింపు పొందాలన్నా కేవలం చదువు ఒక్కటే పరిష్కారామన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పుల కోసం అంబేడ్కర్‌ అడుగు జాడలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నేత క్యామ మల్లేశ్‌

Advertisement
 
Advertisement
Advertisement