ఇబ్రహీంపట్నం: షాద్‌నగర్‌లో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ పిలుపునిచ్చారు. స్థానిక పాషా నరహరి స్మారక కేంద్రంలో ఆదివారం ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయ కార్మిక సంఘం మహాసభను నిర్వహించి, మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్యచరణను ఈ మహాసభల్లో రూపొందించనున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. రెండు పూటల కూలీల హాజరు పద్ధతిని రద్దు చేసి, ఒకేసారి హాజరు తీసుకునే విధానాన్ని తీసుకురావాలన్నారు. ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్‌లో కోత విధించడం సరైనదికాదన్నారు. కూలీలకు 200 పనిదినాలు కల్పించి రోజుకి రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక
వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని 17 మందితో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా కాకి రమేష్, కార్యదర్శిగా చాతళ్ల జంగయ్య, సహాయ కార్యదర్శులుగా గణేశ్, ఆనంద్, ఉపాధ్యక్షులుగా మమత, ప్రేమలత, కమిటీ సభ్యులుగా దానయ్య, వెంకటేశ్, భార్గవ్, ప్రశాంత్, శ్రీనివాస్, బీరయ్య, భారతమ్మ, ఐలమ్మ తదితరులను నియమించారు.
వ్యవసాయ కార్మిక సంఘం
జిల్లా కార్యదర్శి జగన్


