ఆమనగల్లు/కడ్తాల్: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మైసిగండి మాజీ సర్పంచ్ శేఖర్‌గౌడ్‌ను ఎమ్మెల్యే పరామర్శించారు. చెక్కుల పంపిణీ అనంతరం కసిరెడ్డి మాట్లాడుతూ.. పేదల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం అనేక నూతన పథకాలు అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని వివరించారు. రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికి అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, సంధ్యారెడ్డి, శ్రీనివాస్, కృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


