అవసరం లేకున్నా అతిగా కొని.. | - | Sakshi
Sakshi News home page

అవసరం లేకున్నా అతిగా కొని..

Jun 8 2026 10:17 AM | Updated on Jun 8 2026 10:17 AM

మొయినాబాద్‌: మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించడంలో మీన మేషాలు లెక్కిస్తున్న అధికారులు.. అవినీతిలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొన్ని వస్తువులు అవసరం లేకున్నా అతిగా కొనుగోలు చేసి అందులో వాటాలు దండుకుంటున్నారు. మున్సిపాలిటీలో ఇటీవల అధికారులు సున్నం బస్తాలు కొనుగోలు చేశారు. ఒక్కో గ్రామంలో సుమారు 300ల బస్తాలను వార్డు కార్యాలయాల్లో వేశారు. బ్లీచింగ్‌ పౌడర్‌లో కలిపి రోడ్లపక్కన చల్లడానికి వాటని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఏడాది మొత్తానికై నా సుమారు వంద బస్తాలు కూడా వినియోగించే అవకాశం లేదని.. వారు తమ కమీషన్ల కోసం ఎక్కువ కొనుగోలు చేసి వార్డు కార్యాలయాల్లో వృథాగా పడేశారని మున్సిపల్‌ సిబ్బందే వాపోతున్నారు. సున్నం బస్తాలు సరఫరా చేసే కాంట్రాక్టర్‌తో మున్సిపాలిటీలోని ఇద్దరు ముగ్గురు అధికారులు కుమ్మకై ్క ఒకేసారి తెప్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుపై కొందరు కౌన్సిలర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిధులు లేవని చెప్పే అధికారులు.. అనవసర ఖర్చులు చేసి కమీషన్లు దండుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

సున్నం బస్తాల కొనుగోలులో అధికారుల చేతివాటం

Advertisement
 
Advertisement
Advertisement