ఎంబీఏ పట్టభద్రులకు వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

ఎంబీఏ పట్టభద్రులకు వీడ్కోలు

Jun 8 2026 10:17 AM | Updated on Jun 8 2026 10:17 AM

ఎంబీఏ పట్టభద్రులకు వీడ్కోలు

మన్సూరాబాద్‌: సిద్ధార్థ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) పట్టభద్రులు వీడ్కోలు సమావేశం మన్సూరాబాద్‌లోని ప్రలవి గార్డెన్స్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధార్థ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ జి.నాగయ్య మాట్లాడుతూ... కార్పొరేట్‌ రంగంలో వస్తున్న మార్పులతో నైతిక నాయకత్వానికి డిమాండ్‌ పెరుగుతోందన్నారు. ఎంబీఏ అధిక జీతాలిచ్చే ఉద్యోగాలకు మార్గం మాత్రమే కాదని, నిజాయితీ, నూతన ఆవిష్కరణలు, సామాజిక స్పృహతో వ్యాపారాలను నడిపించే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు అభినందించారు. ప్రిన్సిపాల్స్‌ డాక్టర్‌ ఎం.కవిత, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement