వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

వీరన్నగుట్టను దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం

Jun 8 2026 10:17 AM | Updated on Jun 8 2026 10:17 AM

మన్సూరాబాద్‌: వీరన్నగుట్టపై ఉన్న భద్రకాళి రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ యువనేత జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్ర అభివృద్ధి పనులపై సమీప కాలనీలవాసులతో కలిసి ఆదివారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ... వీరన్నగుట్ట ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కల్గిన పుణ్యక్షేత్రమని అన్నారు. ఈ క్షేత్రానికి విచ్చేసే భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్షేత్రాన్ని అప్పటి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని పిలిపించి అభివృద్ధికి రూ. 18 కోట్ల నిధులను మంజూరు చేయించామని ఆయన గుర్తుచేశారు. మొదటి విడతగా రూ. 5.5 కోట్లతో గుట్ట చూట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టామన్నారు. వివాదాల కారణంగా కొత జాప్యం జరిగినా ప్రభుత్వం మారడంతో అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. వీరన్నగుట్ట క్షేత్రం కమిటీ సభ్యుల సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి దివ్యమైన క్షేత్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. శివరాత్రి పర్వదినం రోజు రెండు లక్షల మంది భక్తులు వచ్చిన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రం అభివృద్ధికి 3డీ మ్యాప్‌ సిద్ధం చేశామన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. డ్రైనేజీ, టాగునీటి వసతి కల్పించిన అనంతరం సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. మాజీ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ కళ్లెం రవీందర్‌రెడ్డి, నాయకులు శ్రీధర్‌గౌడ్‌, రవీందర్‌గౌడ్‌, కొసనం ధనలక్ష్మి, రమేష్‌గౌడ్‌, శంకర్‌రెడ్డి, కేకేఎల్‌ గౌడ్‌, నాగభూషణం, సోమనాథ్‌, యాదగిరిస్వామి, సీతారాం, వెంకన్న, సత్యం, రఘునాథరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement