చిలుకూరుకు భక్తుల తాకిడి | - | Sakshi
Sakshi News home page

చిలుకూరుకు భక్తుల తాకిడి

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

చిలుకూరుకు భక్తుల తాకిడి ప్రజల మీద భారం మోపడం సరికాదు

మొయినాబాద్‌: శనైశ్చర జయంతి సందర్భంగా చిలుకూరు బాలాజీ దేవాలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే అధిక సంఖ్యలో క్యూకట్టారు. శవైచ్చర జయంతి రోజు స్వామివారిని దర్శించుకుంటే శని పోతుందని భక్తుల విశ్వాసం. దీంతో పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శనైశ్చర జయంతి గురించి ఆలయ అర్చకుడు రంగరాజన్‌ వివరించారు. బాలాజీని దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు.

పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌

రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి

షాద్‌నగర్‌రూరల్‌: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ శనివారం పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ముఖ్యకూడలిలో నిరసన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ధరలను పెంచి, ప్రజలపై పెనుభారం మోపుతోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు పెరిగాయని, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచి ప్రజల మీద భారం మోపడం సరికాదని అన్నారు. మోదీ ఽప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రమేష్‌యాదవ్‌, ఏఐటీయూసీ నాయకులు శేఖర్‌రెడ్డి, రాములుగౌడ్‌, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement