చెరువుల సుందరీకరణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

చెరువుల సుందరీకరణ చేపట్టాలి

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

మీర్‌పేట: హెచ్‌ఎండీఏ పరిధిలోని అన్ని చెరువుల్లోని గుర్రపుడెక్క తొలగించి సుందరీకరణ చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట సర్కిల్‌ పరిధి చందన చెరువులో గుర్రపుడెక్క తొలగింపు పనులను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో చెరువుల సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెరువులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులు మురికి కూపాలుగా మారి, గుర్రపుడెక్క పెరిగి దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో డీసీ సమ్మయ్య, శానిటేషన్‌ డీఈ అభినయ్‌కుమార్‌, ఏఈ గంగాప్రసాద్‌, స్థానిక నాయకులు అర్కల కామేశ్‌రెడ్డి, సిద్దాల బీరప్ప, జటావత్‌ శ్రీనునాయక్‌, అనిల్‌యాదవ్‌, యాదగిరి ముదిరాజ్‌, మాదరి రమేష్‌, సునీత బాల్‌రాజ్‌ పాల్గొన్నారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement