ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం

Feb 23 2026 9:16 AM | Updated on Feb 23 2026 9:16 AM

ఆర్‌ఎ

ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం

తుర్కయంజాల్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శత జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆదిబట్ల సర్కిల్‌ పరిధి మన్నెగూడలోని శ్లోకా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ప్రతిష్ఠిత వ్యక్తుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ ఉప్పలంచ మల్లికార్జున్‌ భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ వాద భావజాల వ్యాప్తి, క్రమశిక్షణ పెంపొందించే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో 0మహేశ్వరం భాగ్‌ సంఘచాలక్‌ మల్‌రెడ్డి బల్వంత్‌ రెడ్డి, శ్లోకా విద్యా సంస్థల చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ రైతు మృతి

పహాడీషరీఫ్‌: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్దార్‌నగర్‌కు చెందిన అంబోజి యాదయ్య(50) ఈ నెల 19వ తేదీన సాయంత్రం పొలం పనులు ముగించుకొని చెతక్‌ స్కూటర్‌పై ఇంటికి వెళుతున్నాడు. మార్గం మధ్యలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా, నిర్లక్ష్యంగా ఆటో ట్రాలీని నడుపుకొంటూ వచ్చిన డ్రైవర్‌ అతన్ని ఢీకొట్టి పరారయ్యాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమైన యాదయ్యను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స పొందిన ఆయన ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. సీసీ కెమెరాల ఆధారంగా ప్రమాదానికి కారణమైన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మృతదేహాన్ని తీసుకెళ్లండి

చేవెళ్ల: పుష్కరిణిలో ఈనెల 20న హత్య చేసి పడేసిన మృతదేహం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తోంది. ఈ మేరకు పోలీసులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మృతుడు తమిళనాడుకు చెందిన కర్ణయ్య అలియాస్‌ కరుణాకర్‌(60) చేవెళ్లలోని ఆలయ పుష్కరిణిలో అతడు సహజీవనం చేసే మహిళతో బలైన సంగతి తెలిసిందే. మృతుడి కుటుంబసభ్యులు తమిళనాడులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సోదరుడు ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌గా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు సమాచారం. వారి వివరాలు లేకపోవటంతో పోలీసులు ప్రకటనలో.. మృతుడి బంధువులు వచ్చి శవాన్ని తీసుకెళ్లాలని కోరారు. మరింత సమాచారానికి 8712663449, 8712680420, 8712568353 నంబర్లను సంప్రదించాలని కోరారు. మృతదేహం రెండు రోజులుగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు.

రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు

షాద్‌నగర్‌/కొత్తూరు: కదులుతున్న రైలులో నుంచి జారిపడి ఓ యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన నందిగామ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అశ్విన్‌(20) యువకుడు ఆదివారం సాయంత్రం కాచిగూడ నుంచి తమిళనాడుకు రైలులో వెళుతున్నాడు. మార్గమధ్యలో నందిగామ వద్ద ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారి కింద పడ్డాడు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది రాంచంద్రయ్య, పైలెట్‌ మహబూబ్‌లు క్షతగాత్రుడికి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం 1
1/3

ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం

ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం 2
2/3

ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం

ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం 3
3/3

ఆర్‌ఎస్‌ఎస్‌ శత జయంత్యుత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement