
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని టీజీసీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు లింగమొళ్ల దర్శన్‌గౌడ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేపట్టిన ఉద్యోగుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2004 సెప్టెంబర్1 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ విధానాన్ని వర్తింపజేయయడం ద్వారా ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ రాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో జరిగే ఆత్మగౌరవ సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవెల్లి ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శోభన్‌బాబు, నాయకులు ఈశ్వర్, సునీల్, వినోద్‌కుమార్, ముత్యాలు, రాఘవేందర్‌రావు, సుధాకర్, ఖాదర్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.