
గురుకులాల్లో ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్ రేపు
మొయినాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఈ నెల 31న ఇంటర్ స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయని చేవెళ్ల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాలతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండల పరిధిలోని తోలుకట్ట సమీపంలో ఉన్న చేవెళ్ల గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. 2025లో 10వ తరగతి పాసైన విద్యార్థులు హాజరుకావచ్చన్నారు. విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్‌తోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, 4 పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలతో ఉదయం 9 నుంచి ఒంటిగంట లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. మధ్యాహ్నం 2నుంచి కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఖాళీలు పూర్తి చేస్తామని తెలిపారు. ఎంపీసీలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు సమాన మార్కులు ఉంటే గణితం, సైన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా, బైపీసీలో అడ్మిషన్ తీసుకునే వారికి సమాన మార్కులు ఉంటే సైన్స్, గణితంలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
సద్వినియోగం చేసుకోండి
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం సమీపంలోని రాష్ట్ర సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల (సీఓఈ)లో ఇంటర్‌లో పరిమిత ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 31నస్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ విద్యుల్లత తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కొందుర్గు గురుకుల కళాశాలలో..
కొందుర్గు: గురుకుల జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎండీ కుర్షీద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై జూనియర్ కళాశాల ఎంపీసీ, బైపీసీలో చేరాలనే ఆసక్తి గల బాలురు ఈ నెల 31న ఉదయం 9 గంటల వరకు దరఖాస్తులు తీసుకొని కళాశాలలో హాజరుకావాలని సూచించారు. టీసీ, మెమో, బోనఫైడ్, కులం, ఆదాయం ఒర్జినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు సెట్ల జిరాక్స్‌లను తీసుకురావాలన్నారు.
పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
కందుకూరు: ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకుని అమలు చేయాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్‌టీయూ) జిల్లా అధ్యక్షుడు పుట్టపాక ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని పాఠశాలల్లో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నూతన పీఆర్సీ, పెండింగ్ డీఏలను, నూతన ఆర్యోగ కార్డులను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సెక్షన్లను పరిగణలోకి తీసుకోకుండా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అదనపు ప్రధానకార్యదర్శి ఏవీ సుధాకర్, జిల్లా ప్రధానకార్యదర్శి సత్తు పాండురంగారెడ్డి, ఏఐఎస్‌టీఎఫ్ ఉపాధ్యక్షుడు పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికలకు సమాయత్తం అవుదాం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్‌గౌడ్
ఇబ్రహీంపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్‌గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీ మండల సమావేశం మంగళవారం స్థానిక వైష్ణవి గార్డెన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అత్యధిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను గెలిచి జిల్లా పరిషత్, మండల పరిషత్ పీఠాలను వసం చేసుకోవాలని అన్నారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, నాయకులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.
రేపు బుద్ధుడిపై నాటిక ప్రదర్శన
చేవెళ్ల: మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని పీవీ కన్వెన్షన్‌లో ఈనెల 31న ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటికను ప్రదర్శిస్తున్నట్లు సమతా సైనిక్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ బౌధ్ నాగ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.