
‘రిజిస్ట్రీ’తోనే పథకాలు
కందుకూరు: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో లబ్ధిపొందడానికి తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సిందే. ఈ మేరకు ఆన్‌లైన్‌లో వ్యవసాయాధికారులు నమోదు చేపట్టారు. పీఎం కిసాన్ పథకం, సబ్సిడీపై ఫర్టిలైజర్, యంత్ర పరికరాల సరఫరా తదితర క్రేందం అమలు చేయనున్న ప్రయోజనాలు పొందడానికి ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న రైతులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో మూడు నెలలుగా జరుగుతుండగా జిల్లాలో నెలన్నర నుంచి కొనసాగుతోంది.
పట్టాదారు పాస్‌పుస్తం, ఆధార్‌కార్డుతో..
గత డిసెంబర్ 31లోపు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల వివరాలు మాత్రమే ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్నాయి. వాటికే ఆన్‌లైన్‌లో నమోదు జరగనుంది. రైతులు ఏఈఓల వద్దకు తమ పట్టాదారు పాస్‌పుస్తం, ఆధార్‌తో లింకై న సెల్‌ఫోన్, ఆధార్‌కార్డుతో వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలి. ఫోన్ నంబర్‌కు మూడు సార్లు ఓటీపీలు వస్తాయి. వాటిని చెబితే ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూములు ఉన్నా సరే ఎక్కడైనా ఒక దగ్గర ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకుంటే సరిపోతుంది. హైదరాబాద్‌లోని అడ్రస్ ఉన్న ఆధార్ అయినా సరే రిజిస్ట్రీ చేయించుకోవచ్చు. రైతులు సత్వరమే ఏఈఓల వద్దకు వెళ్లి రిజిస్ట్రీ చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ
రైతులంతా నమోదు చేసుకోవాలంటున్న అధికారులు
పథకాలు పొందాలంటే..
కేంద్ర సంక్షేమ పథకాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పటి వరకు మండలంలో 7,800 మంది రైతులు వివరాలు నమోదు చేయించుకున్నారు. చేయించుకోని రైతులు త్వరగా నమోదు చేయించుకోవాలి.
– లావణ్య, ఏఓ, కందుకూరు

‘రిజిస్ట్రీ’తోనే పథకాలు