
బాధ్యతల స్వీకరణ
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ నూతన సీఐగా రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఇక్కడ సీఐగా పని చేసిన రాఘవేందర్‌రెడ్డి బదిలీపై పహాడీషరీఫ్ ఠాణాకు వెళ్లారు. సీఐగా రవికుమార్‌కు రాఘవేందర్‌రెడ్డి బాధ్యతలు అప్పగించారు. అనంతరం సీఐ రాఘవేందర్‌రెడ్డికి ఆదిబట్ల పోలీసులు గజమాలతో సత్కరించారు. నూతనంగా విచ్చేసిన సీఐ రవికుమార్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ తోడ్పాటునందించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకటేష్, సైదులు, నోయల్‌రాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు సహకరించాలి
యాచారం: హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ సీఐగా సత్యనారాయణ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పీఎస్ పరిధిలో శాంతి భద్రతల కోసం కృషి చేస్తానని, ప్రజలు కూడా సహకరించాలని నూతనంగా బాధ్యతల చేపట్టిన సీఐ అన్నారు.

బాధ్యతల స్వీకరణ