
చదువుకోమన్నందుకు.. తనువు చాలించాడు
చేవెళ్ల: మంచిగా చదువుకోవాలని మందలించినందుకు డిగ్రీ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో పరిధి ఆలూరులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూ రు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎరుకల మహిపాల్ కుటు ంబ సభ్యులతో కలిసి ఆలూరులో నివసిస్తున్నాడు. టైలర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్న కుమారుడు విజయ్‌కుమార్(20)ను డిగ్రీ విద్యనభ్యసించేందుకు వికారాబాద్ లోని ఎస్‌ఏపీ కళాశాలలో చేర్పించారు. చదువుపై ఇష్టంలేని యువకుడు.. కళాశాలకు వెళ్లక పోవటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన విజయ్.. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడి, తనువు చాలించాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి చేవెళ్ల ప్ర భుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వ హించి బంధువులకు అప్పగించారు.
రోడ్డు ప్రమాదంలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
షాబాద్: రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. షాబాద్ సీఐ కాతాంరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మాచన్‌పల్లికి చెందిన ఎఫ్‌ఏ కోళ్ల నర్సింహులు (45) షాబాద్‌లోని ఉపాధి హామీ కార్యాలయంలో విధులు ముగించుకొని శుక్రవారం రాత్రి స్వగ్రామానికి బైక్‌పై బయల్దేరాడు. తెలంగాణ మోడల్ స్కూల్ సమీపంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కేరళ నర్సుల అరెస్టు అనైతికం
సాక్షి, సిటీ బ్యూరో: మతమార్పిడి, మ నుషుల అక్రమ రవాణా పేరుతో కేరళకు చెందిన ఇద్దరు నర్సులను అరెస్టు చేయడం దారుణమని అఖిల భారత బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త పూర్ణచందర్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ దళిత, ఆదివాసీ, మైనార్టీ, అణగారిన వర్గాలకు తోడుగా నిలుస్తున్న వారిని లక్ష్యంగా చేసుకోవడం దారుణమన్నారు. బహుజన సమాజ్ శాంతి, సేవ, సమానత్వం కోసం పోరాడిందని తెలిపారు. మతం పేరుతో చీలికలు తేవడం కాదని, న్యాయం కోసం నిలబడాలని ఆయన కోరారు.