
ఇళ్ల నిర్మాణానికిపర్మిషన్ ఇవ్వండి
షాద్‌నగర్‌రూరల్: కష్టపడి కొనుక్కున్న ప్లాట్లపై విధించిన స్టేటస్కోను తొలగించి, ఇల్లు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని రెడ్‌హిల్స్ వెంచర్ బాధితులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లేడ్ చౌదరిగూడ మండలం వెంచర్ ఎదుట ధర్నాచేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ ప్లాట్లను యంత్రాల సహాయంతో చదును చేశారని, ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా అప్పట్లో కొందరిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతంలో ప్రతివాదులు కోర్టులో వేసిన కేసులు వీగిపోయాయని, మరో కేసువేసి కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిని అడ్డుగా పెట్టుకొని జిల్లాపంచాయతీ అధికారి(డీపీఓ) ఏకపక్షంగా వ్యవహరించి, నిర్మాణాలు చేపట్టకుండా స్టేటస్కో విధించారని పేర్కొన్నారు. దానిని తొలగించి, ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బాధితులు బాలరాజ్, వీరయ్య, రమేష్,జంగమ్మ, మల్లమ్మ, కృష్ణయ్య, నర్సింహులు, పుష్పమ్మ, గోపాల్, చంద్రశేఖర్, మహేందర్,వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.