
నటి కల్పిక హంగామా
● బ్రౌన్‌టౌన్ రిసార్ట్స్‌లో హల్‌చల్
● సిబ్బందిపై దుర్భాషలు
● ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న పోలీసులు
మొయినాబాద్: సినీ నటి కల్పిక హంగామా సృష్టించారు. రిసార్ట్స్ మేనేజర్‌పై మెనూ కార్డు, రూం కీస్ విసిరేసి దురుసుగా ప్రవర్తించా రు. ఈ సంఘటన మండల పరిధిలోని కనకమామిడిలో ఉన్న బ్రౌన్‌టౌన్ రిసార్ట్స్‌లో చోటుచేసుకుంది. ఆమె సోమవారం సాయంత్రం క్యాబ్‌లో రిసార్ట్స్‌కు వచ్చింది. రూంలో దిగిన వెంటనే సిగరెట్లు కావాలంటూ సిబ్బందిని దుర్భాషలాడారు. రిసెప్షన్‌లో ఉన్న మేనేజర్ కృష్ణ వద్దకు వెళ్లి మెనూ కార్డు, రూంకీస్ మొహంపై విసిరేసి బూతు పురాణంతో రెచ్చిపోయారు. 40 నిమిషాలపాటు హల్‌చల్ చేశారు.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికే..
ఇటీవల నగరంలోని ఓ పబ్‌లో గొడవ చేసిన ఆమైపె కేసు నమోదైంది. పోలీసులు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం.
క్యాబ్, వైఫై ఫెసిలిటీ లేదు
బ్రౌన్‌టౌన్ రిసార్ట్స్‌లో జరిగిన హంగామాపై సినీనటి కల్పిక వివరణ ఇచ్చారు. రిసార్ట్స్‌లో జరిగిన విషయాలను వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివిధ కేసుల్లో పోలీసులు తన వెంట పడుతున్నారని రిసార్ట్స్‌కు వెళ్లానని.. అక్కడ సిగరెట్ తేవాలని సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదని వీడియోలో పేర్కొన్నారు. తన ఫోన్‌లో సిగ్నల్ లేదని క్యాబ్ బుక్‌చేయడానికి వైఫై ఫెసిలిటీ లేదని.. క్యాబ్ ఫెసిలిటీ లేదా అని అడిగానని.. అందుకే తిట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. రిసార్ట్స్ సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

నటి కల్పిక హంగామా