పల్లెల్లో డ్రోన్ల కలకలం | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో డ్రోన్ల కలకలం

Mar 22 2025 9:07 AM | Updated on Mar 22 2025 9:08 AM

చేవెళ్ల: మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా రాత్రి వేళ డ్రోన్లు సంచరించడం కలకలం రేపుతోంది. మండలంలోని చేవెళ్ల, కందవాడ, ఊరేళ్ల, సింగప్పగూడ, కేసారం తదితర గ్రామాల్లో డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. గురువారం రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో డ్రోన్లు తిరిగినట్లు గుర్తించిన కొంతమంది వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఏం జరుగుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై చేవెళ్ల సీఐ భూపాల్‌ శ్రీధర్‌ను వివరణ కోరగా కందవాడ గ్రామంలో ఆర్‌హెచ్‌ రీసెర్చ్‌ అనే కంపెనీ పరిశోధనలో భాగంగా కొద్ది రోజుల పాటు డ్రోన్లు ఉపయోగించుకుంటామాని అనుమతి తీసుకున్నట్లు తెలి పారు. వారే డ్రోన్లు వినియోగించి ఉంటారని, ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఏదైనా ఉంటే మళ్లీ ఆ కంపెనీ వారితో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పారు.

వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

కేశంపేట: పంచాయతీ కార్యదర్శులు మూడు రోజుల్లోగా వందశాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌ ఆదేశించారు. మండల పరిధి లోని సంగెం గ్రామ పంచాయతీని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామంలో ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సురేష్‌ మోహన్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, మురుగు కాల్వలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎల్‌ఆర్‌ఎస్‌పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కాగా, పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించాలని పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా నాయకుడు రాంచంద్రయ్య అధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన కార్మికులు డీపీఓకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో డీఎల్‌ పీఓ మల్లారెడ్డి, ఎంపీడీఓ రవిచంద్రకుమార్‌రెడ్డి, ఎంపీఓ కిష్టయ్య పాల్గొన్నారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు

సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌లో జరగనున్న ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు సుమారు 2,700 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 18వ ఎడిషన్‌ టాటా ఐపీఎల్‌–2025 క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో పలు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయను న్నారు. ఈ సందర్భంగా శుక్రవారం రాచకొండ సీపీ సుధీర్‌ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. లాఅండ్‌ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులతో పాటు షీ టీమ్స్‌, ఎస్‌బీ, సీసీఎస్‌, ఎస్‌ఓటీ, ఆక్టోపస్‌, ఏఆర్‌ వంటి అన్ని విభాగాల పోలీసులు బందోబస్త్‌లో పాల్గొంటారని తెలిపారు. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు ఉప్పల్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ పరిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని, ఈమేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. స్టేడియం చుట్టూ 450 సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టనున్నామని చెప్పారు.

నిమ్స్‌లో కొత్త యూనిట్‌

లక్డీకాపూల్‌: అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో కూడిన నిమ్స్‌ మరో సరికొత్త వైద్య విభాగాన్ని సమకూర్చుకుంది. మూర్ఛ వ్యాధికి గట్టి భరోసా కల్పించే దిశగా అధునాతన పీడియాట్రిక్‌ న్యూరాలజీ, ఎపిలెప్సీ మ్యానిటరింగ్‌ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది. మొయినాబాద్‌ రోటరీ క్లబ్‌, ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సంస్థల సహకారంలో మిలీనియం బ్లాక్‌లో ఈ యూనిట్‌ని ఏర్పాటు చేసింది. శుక్రవారం ఈ విభాగాన్ని ప్రీమియర్‌ ఎనర్జీస్‌ చైర్మన్‌ సురేంద్ర పాల్‌సింగ్‌, రోటరీ జిల్లా గవర్నర్‌ శరత్‌ చౌదిరి, రోటరీ గవర్నర్‌ డాక్టర్‌ ఎస్‌.రాంప్రసాద్‌తో కలిసి రోటరీ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ ప్రతినిధి డేనియల్‌ హిమెల్స్‌పాచ్‌ ప్రారంభించారు.

పల్లెల్లో డ్రోన్ల కలకలం 1
1/1

పల్లెల్లో డ్రోన్ల కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement