‘రంగారెడ్డి’ని ముక్కలు చేశారు | - | Sakshi
Sakshi News home page

‘రంగారెడ్డి’ని ముక్కలు చేశారు

Jan 14 2026 11:23 AM | Updated on Jan 14 2026 11:23 AM

‘రంగా

‘రంగారెడ్డి’ని ముక్కలు చేశారు

మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి

అనంతగిరి: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను బీఆర్‌ఎస్‌ కై వసం చేసుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్‌ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. ఎప్పుడు ప్రజా సమస్యలపై నిలదీస్తున్న తరుణంలో సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తుంటారని మండిపడ్డారు. వారం రోజులుగా నిరుద్యోగులు రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌ ఎప్పుడు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా అరెస్టులు, నిర్భందాలు చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే సీఎం జిల్లాల పునర్విభజన అంశం తెర మీదకు తీసుకు వచ్చారన్నారు. కేసీఆర్‌ తీసుకువచ్చిన జిల్లాల్లో ఏ ఒక్కటి పోయినా బీఆర్‌ఎస్‌ పార్టీ ఊరుకోబోదని, ఆ జిల్లాకు చెందిన ప్రజలు కూడా ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను ముక్కలుముక్కలుగా చేస్తూ జీహెచ్‌ఎంసీలో కలిపి ఆ జిల్లా ఉనికి లేకుండా చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌ను తప్పిస్తే మిగతా ప్రాంతాలపై శీతకన్ను వేశారని ఆరోపించారు. ప్రస్తుతం వికారాబాద్‌లో కొనసాగుతున్న బ్రిడ్జి పనులు కూడా కేసీఆర్‌ హయాంలోనే మంజూరైనవే అన్నారు. వికారాబాద్‌లో మున్సిపల్‌ ఎస్‌టీపీ ప్లాంట్‌ ఏడాదిన్నరగా పనిచేయకపోవడంతో మురుగు నీరంతా మూసీలో కలుస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, ఎడ్యుకేషన్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోపాల్‌ ముదిరాజ్‌, మాజీ ఏఎంసీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, రమేష్‌గౌడ్‌, రామస్వామి, దేవదాసు, పాండు, గిరీష్‌, సుభాన్‌రెడ్డి, విజయేందర్‌, పావని, ప్రవళిక, ఆయా వార్డుల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ నియమాలు పాటించండి

కొందుర్గు: ట్రాపిక్‌ నియమాలు పాటించి, క్షేమంగా ఇల్లు చేరుకోవాలని డీసీపీ శిరీష సూచించారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రీమియర్‌లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ చంద్రశేఖర్‌, ఎంవీఐ వాసు, ఎస్‌ఐ రవీందర్‌ నాయక్‌, సర్పంచ్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి

షాద్‌నగర్‌రూరల్‌: రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలందరు భాగస్వాములు కావాలని డీసీపీ శిరీష పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఫరూఖ్‌నగర్‌ మండలం రాయికల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్‌, సర్పంచ్‌ జ్యోతి పాల్గొన్నారు.

‘రంగారెడ్డి’ని ముక్కలు చేశారు 
1
1/1

‘రంగారెడ్డి’ని ముక్కలు చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement