చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అటవీ శాఖ డీఆర్‌ఓ జగన్‌మోహన్
షాద్‌నగర్: చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్(డీఆర్‌ఓ) జగన్‌మోహన్ హెచ్చరించారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలో పలుదుకాణాల్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనా మాంజాలను విక్రయించడం చట్టరీత్యా నేరమన్నారు. నిషేధిత మాంజా విక్రయాలు, నిల్వలపై దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మాంజాలతో పక్షులు, జంతువులు, వన్య ప్రాణులు గాయాల పాలవుతున్నాయని చెప్పారు. దుకాణాల్లో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు దూది ధారంతో పంతంగులను ఎగురవేయాలని సూచించారు. ఈ తనిఖీల్లో అటవీశాఖ అధికారులు రవీందర్‌గౌడ్, అజీజ్, వినోద్‌కుమార్, రవీందర్‌రెడ్డి, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌గా ఎన్నికైతే డీలర్‌కు రాజీనామా చేయండి
జిల్లా పౌరసరఫరాల శాఖ డీటీ మాచన రఘునందన్
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా పంపిణీ వ్యవస్థ గొప్పదని, ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునేందుకు చక్కటి అవకాశమని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు రేషన్ డీలర్లు సర్పంచ్‌లుగా పోటీ చేసి గెలుపొందారని ఇది గొప్ప పరిణామమన్నారు. కానీ సర్పంచ్‌లు అయ్యాక డీలర్‌గా కొనసాగటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేసిన రేషన్ డీలర్లు స్వచ్ఛందంగా రాజీనాయా చేయకపోతే డీలర్‌షిప్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. సర్పంచ్ అయ్యాక కూడా డీలర్‌గా కొనసాగాలనే ఆలోచన తీసేయాలని సూచించారు. రేషన్ డీలర్‌షిప్ కేవలం ఒక గౌరవప్రదమైన ఉపాధి అవకాశం అని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కలిగిందన్నారు. బాధ్యతతో రాజీనామా చేయాలని తెలిపారు.
న్యాయమైన పరిహారం ఇప్పించండి
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న మండల పరిఽధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, ఆయా సర్పంచ్‌లు సోమవారం ఎంపీ డాక్టర్ మల్లు రవిని కలిసి విన్నవించారు. భూమి కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం ఎకరాకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వడం తగదని, గ్రీన్ ఫీల్డ్ మొదటి మార్గం రావిర్యాల నుంచి చివరి మార్గం ఆకుతోటపల్లి వరకు ఒకే విధంగా పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ హామీ ఇచ్చారని భూ నిర్వాసితులు తెలిపారు. కార్యక్రమంలో అచ్చంపేట్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, సర్పంచులు కరుణాకర్‌గౌడ్, ఈర్లపల్లి రవి, నాయకులు రవికాంత్‌గౌడ్, మధు, మల్లేశ్‌గౌడ్, దీపక్, శ్రీరాములు, రమేశ్‌నాయక్, నర్సింహ, హరీశ్ తదితరులుపాల్గొన్నారు.
చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు
చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు


