ప్రజా జీవితాల్లో మార్పే అసలైన అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రజా జీవితాల్లో మార్పే అసలైన అభివృద్ధి

Jan 13 2026 7:38 AM | Updated on Jan 13 2026 7:38 AM

ప్రజా జీవితాల్లో మార్పే అసలైన అభివృద్ధి

ప్రజా జీవితాల్లో మార్పే అసలైన అభివృద్ధి

● మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ● చేవెళ్లలో రూ.95 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

చేవెళ్ల/శంకర్‌పల్లి: ప్రజల జీవితాల్లో కనిపించే మార్పే నిజమైన అభివృద్ధి అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో రూ.95 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఆస్పత్రి నూతన భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. పలు వార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ శ్రీలత, ఏసీఎస్‌ మాజీ చైర్మన్లు గోనె ప్రతాప్‌రెడ్డి, దేవర వెంకట్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు జానార్దన్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, ఆగిరెడ్డి, ప్రభాకర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, ఎం.క్రిష్ణారెడ్డి, వీరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణ కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ జెండానే ఎగురవేయాలని మంత్రులు సూచించారు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు సర్పంచులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

రేవంత్‌ పాలనలో మంత్రులకు ప్రాధాన్యం

అనంతరం శంకర్‌పల్లి మున్సిపాలిటీలో రూ.2.85 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అక్కడ వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పాలన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలనను గుర్తు చేస్తోందన్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా సంబంధిత శాఖల్లో మంత్రుల మాటే ఫైనల్‌గా ఉండేలా చూస్తున్నారన్నారు. కేవలం వైఎస్‌ పాలనలోనే మంత్రులకు ఇలాంటి ప్రాధాన్యం, స్వేచ్ఛ ఉండేదని గుర్తు చేసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం, తీరిక తమకు లేదన్నారు. గతంలో పుష్ప– 2 సినిమా బెనిఫిట్‌ షో సమయంలో జరిగిన సంఘటనతో అందరూ బాధపడిన విషయం తెలిసిందేనన్నారు. అప్పుడు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి, తాను మాట్లాడుతూ.. సినిమా టికెట్ల రేట్లను పెంచబోమని చెప్పిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు.ఆతర్వాత సీఎంతో పాటు మంత్రులందరూ కలిసి మాట్లాడుకున్నామని, టికెట్ల రేట్లను పెంచి, అందులో వచ్చే ఆదాయంలో 20శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించా రు. ఆ తర్వాత జీవో ఇచ్చినా, సినిమాల విషయంలో కోర్టు అభ్యంతరం తెలిపిందన్నారు. అయి తే సంక్రాంతికి విడుదలైన సినిమాలకు జీవో విడుదలైన సమయంలో తాను నల్గొండ, భువనగిరి జిల్లాల పర్యటనలో ఉండడంతో విషయం తనకు తెలియదన్నారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మొయినాబాద్‌ రూరల్‌: మొయినాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అజీజ్‌నగర్‌ డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల వద్ద సీసీ రోడ్డు పనులు, హిమాయత్‌నగర్‌ చౌరస్తాలో అండర్‌ డ్రైనేజీ మురుగు కాలువ, చిలుకూరు దేవాలయం వద్ద బాత్‌రూమ్‌ల నిర్మాణం తదితర పనులు శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల కాలె యాదయ్య, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement