లారీ ఢీకొని.. ఆర్టీసీ కండక్టర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్‌ మృతి

Aug 16 2023 6:30 AM | Updated on Aug 16 2023 8:19 AM

- - Sakshi

కరీంనగర్‌ – హైదరాబాద్‌ రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్‌ మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

హైదరాబాద్: కరీంనగర్‌ – హైదరాబాద్‌ రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్‌ మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం జినోమ్‌వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌ బ్యాగరి నవీన్‌కుమార్‌, వెంకటాపూర్‌కు చెందిన బాలనర్సయ్య(49) మంగళవారం ప్రయాణికులతో జేబీఎస్‌కు బయలుదేరారు.

మార్గమధ్యంలో శామీర్‌పేట మండలం, అచ్చాయిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులను దించేందుకు రోడ్డుపక్కన బస్సును నిలపడంతో అదే సమయంలో వేగంగా వచ్చిన బొలేరో వాహనం బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌లు కిందకు దిగి బస్సును పరిశీలిస్తుండగా అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు బొలేరో వాహనాన్ని తగలడంతో బోల్తా పడింది.

ఈ ఘటనలో కండక్టర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, బస్సు డైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement