ఫలించని పథకం | - | Sakshi
Sakshi News home page

ఫలించని పథకం

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

మంచు దుప్పటి

సిరిసిల్ల, వేములవాడ పట్టణాలపై ఆదివారం వేకువజామున మంచు దుప్పటి పరుచుకుంది. రహదారులు, పంటపొలాలను కమ్మేసింది. ఉదయం 8 గంటలు దాటినా సూర్యుడు కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పొగ మంచుతోపాటు చలి గజగజ వణికిస్తున్నా చిరువ్యాపారులు తమ బతుకు పోరును కొనసాగించారు. వాకర్స్‌, పాలు, కూరగాయలు అమ్మేవారు తమ పనుల్లో నిమగ్నమయ్యారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, రాజన్న సిరిసిల్ల/వేములవాడ

వేణుగోపాలస్వామి

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రుక్మిణి, సత్యభామ సమేత స్వామివారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అశ్వవాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆనవాయితీ ప్రకారం టపాసులు పేల్చి స్వామివారి ఎదుర్కోళ్లు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేద పండితులు కల్యాణం జరిపించారు. భక్తులు తరలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు. – ఎల్లారెడ్డిపేట

‘ఇది సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌ సాంచాల కార్ఖానా. ఇక్కడ నేత కార్మికులు నిత్యం 10 గంటల పాటు సాంచాల మధ్య పని చేస్తే వారానికి రూ.3వేలు వస్తాయి. అదే ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు

ఉంటే వారానికి రూ.4వేలు వస్తాయి. సిరిసిల్లలో వస్త్రపరిశ్రమ, నేత కార్మికుల సమస్యలపై పూర్తి

స్థాయి అవగాహనతో 2017 అక్టోబరు 11న అప్పటి సీఎం కేసీఆర్‌ రూ.386.88 కోట్లతో

‘వర్కర్‌ టూ ఓనర్‌’ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ పథకం అమలయితే నేత కార్మికులే

యజమానులుగా స్వయంసమృద్ధిని సాధిస్తూ నెలకు రూ.30 వేల నుంచి రూ.50వేలు సంపాదించే

అవకాశం ఉంటుంది.’

కల్యాణ వైభోగమే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement