పరివర్తన్‌తోనే దేశ శ్రేయస్సు | - | Sakshi
Sakshi News home page

పరివర్తన్‌తోనే దేశ శ్రేయస్సు

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

సిరిసిల్లటౌన్‌: సద్భావన, పంచపరివర్తనతో దేశ శ్రేయస్సును కాపాడుదామని జిల్లా సద్భావన కమిటీ ప్రముఖ్‌ భూమయ్య అన్నారు. ఆదివారం సామాజిక సద్భావన కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల లోని శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో అన్ని కుల సంఘాల పెద్దలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కులాల మధ్య అంతరాలు తొలగి సమన్వయం, సోదరభావం పెంపొందినప్పుడే దేశం, సంస్కృతి బలోపేతమవుతాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‘పంచ పరివర్తన్‌’ అంశాలపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. రాపెల్లి ముకుందం, మోర శ్రీనివాస్‌, చేపూరి నాగరాజు, జూపల్లి నాగేందర్‌రావు, విశ్వనాథుల కిషన్‌, తుంగ పవన్‌, రేచర్ల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement