బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సిరిసిల్ల: కరీంనగర్‌లో నిర్వహించే దీక్షా దివస్‌ను బీఆర్‌ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు కోరారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. ఈ నెల 29న కరీంనగర్‌లో దీక్షా దివస్‌కు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజరు కావాలన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులకు దిశానిర్దేశనం చేశారు. బీఆర్‌ఎస్ అంతర్గత సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, నాప్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సందీప్, స్థానిక కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
శుభకార్యాల్లో..
జిల్లాలో జరిగిన శుభకార్యాల్లో కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో జరిగిన సిరిసిల్లకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు దాసరి గోపాల్ కూతురు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. సిరిసిల్ల శాంతినగర్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు మండల బాలరాజు కొడుకు పెళ్లి ఇటీవల జరగ్గా.. ఆయన ఇంటికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ భవన్‌లో సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి ఇంటి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అగ్రహారం వద్ద కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించగా, దాదాపు మూడు వేల మంది ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొని భోజనాలు చే శారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్సా దశరథం, కొత్తపల్లి శ్రీనివాస్, సత్తయ్య తదితరుల పాల్గొన్నారు.
వేణుగోపాలస్వామికి పూజలు
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం శ్రీవేణుగోపాలస్వామి కల్యాణ వేడుకలకు కేటీఆర్ హాజరై స్వామివారికి పూజలు చేశారు. ఆలయ పునర్ నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య , ఏఎంసీ చైర్మన్ దేవానందం, వైస్ చైర్మన్ నందికిషన్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు దోమ్మాటి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఈరబోయిన రమేశ్ కుమారుడు, కోడలును ఆశీర్వదించారు. అంతకుముందు నర్మాలకు చెందిన యాదిలాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.


