మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

వేములవాడ: మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ అన్నారు. కొందరు యువకులు, మైనర్లు బైక్‌లు, కార్లకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చుకుని అతివేగంతో తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అసౌకర్యానికి, భయభ్రాంతులకు గురవడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ ఎస్సై రాజు ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చిన, అతివేగంగా నడిపే వారి వాహనాలను సీజ్‌ చేయడం జరిగిందన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, వాహన యజమాని, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి భారీ జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

కొలనూర్‌ విద్యార్థినికి జాతీయ పురస్కారం

కోనరావుపేట: పద్య కవితల పోటీలో కోనరావుపేట మండలం కొలనూరుకు చెందిన విద్యార్థిని నాంతాబాద్‌ సుస్మిత జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. కొలనూరు జెడ్పీ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న సుస్మిత సుమారు వంద పద్యాలు రచించింది. వీటిలో కొన్నింటిని జాతీయస్థాయి పోటీలకు పంపించారు. వీటిని పరిశీలించిన నిర్వాహకులు సుస్మితను ప్రోత్సాహక బహుమతికి ఎంపిక చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన బాలల సాంస్కృతికోత్సవంలో పురస్కారం అందజేశారు. గైడ్‌ టీచర్‌ గుర్రం అంజయ్య, హెచ్‌ఎం రాధారాణి పాల్గొన్నారు. సుస్మితను మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్‌ వీరవేణి తిరుపతి, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు కేటాయించాలి

సిరిసిల్లటౌన్‌: పట్టణంలోని శాంతినగర్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను అర్హులైన పేదలకు వారం రోజుల్లోగా పంపిణీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో డబుల్‌బెడ్రూం కాలనీ సందర్శించి నిరసన తెలిపారు. కాలనీలో ఇళ్లు నిర్మించి ఐదేళ్లు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలోగా ప్రభుత్వం స్పందించకుంటే అర్హులైన పేదలను తీసుకెళ్లి ఆ ఇళ్లలో ఉంచుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే కేటీఆర్‌ వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి పేదలకు ఇందిరమ్మ, డబుల్‌ బెడ్రూం ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు కోడం రమణ, సూర పద్మ, శ్రీరాముల రమేశ్‌చంద్ర, ఎలిగేటి రాజశేఖర్‌, నక్క దేవదాస్‌, దాసరి రూప, మోర తిరుపతి, నల్ల లావణ్య, నాగుల సత్యనారాయణ, చీకట్ల మహేశ్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి

ఇల్లంతకుంట: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘాల సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు చందనగిరి గోపాలచారి అన్నారు. ఆదివారం మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరై మాట్లాడారు. విశ్వబ్రాహ్మణ కుటుంబాల్లో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించాలని కోరారు. ఈసందర్భంగా సంఘ భవనానికి స్థలం కేటాయించే ఏర్పాటు చేస్తానని సర్పంచ్‌ మామిడి రాజు పేర్కొన్నారు. అధ్యక్షుడు దేశరాజు తిరుపతిచారి, బోగొని ఆంజనేయులు, అంతగిరి వినయ్‌కుమార్‌, తిప్పారపు స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement