నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

నిధులు కేటాయించాలి

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

తంగళ్లపల్లి: మండలంలోని బద్దెనపల్లి, సారంపల్లి గ్రామాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.10 లక్షలు కేటాయించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆయా గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను ఆదివారం పరిశీలించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నయా పైసా మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నందున ప్రత్యేక ప్రాజెక్టుగా పరిగణించి పేద కార్మికుల కళ్లలో ఆనందం నింపాలని కోరారు. నియోజకవర్గ ఇంచార్జి గుంటి వేణు, మండల కార్యదర్శి సోమ నాగరాజు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement