భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

● అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌

సిరిసిల్ల: భూ భారతి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడూ పరిష్కరించాలని, భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ భూభారతి దరఖాస్తులను సమగ్రంగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. భూముల రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు డి.శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, భూరికార్డులు, సర్వేశాఖ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement