రాజన్నకు ఏకాంత పూజలు చేస్తున్న అర్చకులు
నెమలి వాహనంపై ఊరేగుతున్న స్వామి వారు
నెమలివాహనంపై విహరింపు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో దీపావళి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో స్వామి వారికి అర్చకులు ఏకాంతంగా నిత్యపూజలు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు ధనలక్ష్మీ పూజ నిర్వహించారు. అనంతరం పార్వతీరాజరాజేశ్వరస్వామి, అనంతపద్మనాభస్వామి వారల ఉత్సవమూర్తులను నెమలి వాహనంపై మేళతాళాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: చీకటిని చీల్చుతూ వెలుగులు పంచే దీపావళి వేడుకను జిల్లా ప్రజలు అంబరాన్నంటేలా నిర్వహించుకున్నారు. పలువురు భక్తిశ్రద్దలతో కేదారీశ్వర నోములు జరుపుకున్నారు. ఏటా నరక చతుర్దశి, మరుసటి రోజు దీపావళి జరుపుకోవడం ఆనవాయితీ. ఈయేడు రెండు ఒకేరోజు ఆదివారం జరుపుకున్నారు. వ్యాపారులు ధనలక్ష్మి పూజలు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మానేరుతీరంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల్లో కొనుగోళ్లు జోరుగా సాగాయి.


