● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ నగేశ్
సిరిసిల్ల అర్బన్: కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివస్తున్నారు. పింఛన్ మంజూరు చేయాలని, విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని, పొలానికి తొవ్వలేదని.. ఇలా తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్నవిస్తున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 66 దరఖాస్తులను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ స్వీకరించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు 7 రాగా, ఎంపీడీవో కార్యాలయాలకు మొత్తం 27 దరఖాస్తులు వచ్చాయి. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆర్థిక సహాయం చేయండి
మాది తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి. నేను క్యాన్సర్‌తో బాధడుతున్నాను. నాకు ఒక కూతురు ఉంది. ఉండడానికి ఇల్లు లేదు, నిస్సహాయస్థితిలో నా కూతురితో కలిసి జీవిస్తున్నాం. నా కూతురు డిగ్రీ వరకు చదువుకుంది. మాకు ఏదైనా ఉపాధితోపాటు వైద్యఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేయాలి.
– ఇమ్మడోజి విజయ, దేశాయిపల్లి
మట్టికి అనుమతి ఇవ్వాలి
మాది సిరిసిల్ల పరిధిలోని 10వ వార్డు చిన్నబోనాల. మాకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. బేస్‌మెంట్ వరకు పనులు పూర్తి చేశాం. భరంతి లేక పనులు ఆగిపోయాయి. చిన్నబోనాల పెద్దచెరువు నుంచి మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలి.
– ఇందిరమ్మ లబ్ధిదారులు, చిన్నబోనాల
అదనపు గదులు మంజూరు చేయండి
మా ఊరు స్తంభంపల్లిలో ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. పాఠశాలలో ఐదు తరగతుల్లో 40 మంది విద్యార్థులకు ఒకే తరగతి గది మాత్రమే ఉంది. అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయించాలి.
– అశోక్, స్తంభంపల్లి సర్పంచ్
విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇప్పించాలి
మాది ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి. విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విద్యుత్ మీటర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ నెలల తరబడి తిప్పించుకుంటున్నారు. సంబంధిత ఏఈ, లైన్‌మెన్ తీరుపై విచారణ జరిపించి నాకు న్యాయం చేయండి. విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇప్పించండి.
– పిట్ల చంద్రం, మొర్రాయిపల్లి, ముస్తాబాద్
వెళ్లనివ్వడం లేదు
మాది వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్. మా ఊరి పక్కన ఉన్న వట్టెంల శివారులో నేను వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన. అందులో ఉన్న రోడ్డు వెంట మమ్మల్నీ వెళ్లనీయడం లేదు. ఆ తొవ్వ నుంచి వెళ్లేలా చూడాలి.
– బుర్ర లచ్చయ్య, ఫాజుల్‌నగర్
పోలీసులపై నమ్మకం పెంచాలి


