సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల ఫీజును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ చెల్లించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు జిల్లాలకు(కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, హనుమకొండ) చెందిన మొత్తం 10,959 మంది విద్యార్థుల కోసం రూ.13,65,390 ఆర్థిక సహాయం అందించారు. ఇందులో భాగంగా జిల్లాలోని 3,920 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పరీక్ష ఫీజుల మొత్తం రూ.4.90 లక్షలు పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌కు అందజేశారు.
కార్మికులకు నేరుగా సహాయం అందించాలి
బోయినపల్లి: లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి కార్మికులకు బెనిఫిట్స్ అందించే విధానంలో కాంట్రాక్టు విధానం రద్దు చేసి, నేరుగా లేబర్ ఆఫీసర్ల ద్వారానే అందించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు. మండలంలోని కొదురుపాక, వెంకట్రావుపల్లి, కొత్తపేట సుతారి సంఘాల సమావేశాల్లో సోమవారం పాల్గొని మాట్లాడారు. 55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5వేలు పెన్షన్, పెళ్లికి రూ.లక్ష, డెలివరీకి రూ.50 వేలు ఇవ్వాలని కోరారు. జిల్లాకు పూర్తిస్థాయి లేబర్ ఆఫీసర్‌ను నియమించాలన్నారు. రాజన్న, లచ్చయ్య, మల్లేశం, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
అధికారుల తనిఖీలు
ఇల్లంతకుంట: మండల కేంద్రంలోని పాన్‌షాప్స్, సూపర్ మార్కెట్‌లలో సోమవారం జిల్లా మత్తు పదార్థాల నియంత్రణ అధికారులు తనిఖీలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మత్తు పదార్థాల నియంత్రణాధికారి గంగయ్య మాట్లాడుతూ యువకులు, విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకూడదని సూచించారు. తల్లిదండ్రులు యువతను కనిపెడుతూ ఉండాలని సూచించారు. సిబ్బంది వి.సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
నీటి సమస్య పరిష్కరించండి
ముస్తాబాద్: ముస్తాబాద్ ఎనిమిదో వార్డులో నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు మండల పరిషత్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. ప్రజావాణిలో నీటి ఎద్దడిని పరిష్కరించాలని అర్జీ పెట్టుకున్నారు. నల్లా నీరు రావడం లేదని, గ్రామసభలో సమస్య ఉందని తెలిపినా పరిష్కరించలేదన్నారు. మా నేరు కెనాల్ పక్కనే ఉండడంతో పాములు వ స్తున్నాయన్నారు. వీధిలైట్లు లేవన్నారు. డొక్క కనకరాజు, ప్రశాంత్, సాయి, రాజు, శేఖర్, మణెమ్మ, లచ్చవ్వ, ముత్తమ్మ, రజని ఉన్నారు.
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వనిత
సిరిసిల్లటౌన్: జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాముని వనితనలినీకాంత్ మూడోసారి నియమితులయ్యారు. సోమవారం నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయ అధ్యక్షురాలు అల్కాలంబా, రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేకే మహేందర్‌రెడ్డిలకు వనిత కృతజ్ఞతలు తెలిపారు.


