రెండు నెలలకే ముగిసిన వైవాహిక జీవితం | - | Sakshi
Sakshi News home page

రెండు నెలలకే ముగిసిన వైవాహిక జీవితం

Nov 1 2026 12:33 AM | Updated on Nov 1 2026 12:33 AM

● ఒంటరితనం భరించలేక వివాహిత ఆత్మహత్య ● కుటుంబంలో తీరని విషాదం

● ఒంటరితనం భరించలేక వివాహిత ఆత్మహత్య ● కుటుంబంలో తీరని విషాదం

సిరిసిల్ల అర్బన్‌: కొత్త ఆశలు.. ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన యువతి.. ఒంటరితనం భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన రెండు నెలలకే తనువు చాలించింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన కటకం సుదర్శన్‌–లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురు గాజుల(కటకం) అశ్రిత(24)ను రెండు నెలల కిత్రం వేములవాడ మండలం జోగాపురం గ్రామానికి చెందిన గాజుల రాజశేఖర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. రాజశేఖర్‌ 20 రోజుల క్రితం గల్ఫ్‌ బాట పట్టడంతో అశ్రిత బతుకమ్మ పండుగ కోసం చంద్రంపేటలోని తల్లిగారింటికి వచ్చింది. భర్త ఉపాధి కోసం కువైట్‌ వెళ్లడంతో ఒంటరితనం భరించలేక తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

ముస్తాబాద్‌: రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం మోహినికుంటకు చెందిన పయ్యావుల రాయమల్లు(52) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు. వ్యవసాయం, హమాలీ పనులు చేసే రాయమల్లుకు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహలు జరిగాయి. కుమారుడు వెంకటేశ్‌ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లాడు. భార్య పద్మ కూతురు వద్దకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న రాయమల్లు ఉరివేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. రాయమల్లు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఫిర్యాదు అనంతరం విచారణ చేపడతామని ఎస్సై జ్యోతి తెలిపారు.

ఉపాధ్యాయుల సేవలు మరువలేనివి

బోయినపల్లి: ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని ఎంఈవో శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని స్తంభంపల్లి హైస్కూల్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్‌)గా విధులు నిర్వహించిన గుండెల్లి చంద్రమౌళి ఉద్యోగ విరమణ సభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు చంద్రమౌళి దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బొంగాని అశోక్‌గౌడ్‌, హెచ్‌ఎం ఉమారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాక్‌ పార్లమెంట్‌లో విద్యార్థినికి అవార్డు

వేములవాడరూరల్‌: వేములవాడ రూరల్‌ మండలం హన్మాజిపేట పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థిని బుర్ర తపస్వినిగౌడ్‌ మాక్‌ పార్లమెంట్‌లో పాల్గొని స్పెషల్‌ అవార్డు పొందింది. హైదరాబాద్‌లో నిర్వహించి కార్యక్రమంలో పాల్గొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement