రైతుల సంక్షేమమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతుల సంక్షేమమే లక్ష్యం

Oct 27 2026 1:14 AM | Updated on Oct 27 2026 1:14 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట: రైతులకు అవసరమైన సేవలు అందించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన కొలనూర్‌ సింగిల్‌విండో నూతన అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల అభినందన సభలో పాల్గొని మాట్లాడారు. సింగిల్‌విండోలు రైతులు పండించిన పంటలను దళారుల ప్రమేయం లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు. సంఘం నిర్వహణలో ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అంతకుముందు మరిమడ్లలో అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. సర్పంచ్‌ జలగం అరవింద్‌రావు, సింగిల్‌విండో చైర్మన్లు బొమ్మెన భాస్కర్‌రావు, చేపూరి గంగాధర్‌, మాజీ చైర్మన్‌ బండ నర్సయ్య, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానుక సత్యం, ఏఎంసీ చైర్మన్‌ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement