సిరిసిల్ల: ప్రజాస్వామ్య పరిరక్షణకు మరో ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐసీసీ పరిశీలకుడు శరత్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటును రక్షిస్తేనే దేశాన్ని రక్షించినట్లని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీజేపీ ప్రభుత్వం 13 కోట్ల ఓట్లను ఎస్‌ఐఆర్ పేరిట తొలగించిందన్నారు. ఓటర్ల తొలగింపుపై రాహుల్‌గాంధీ మొదటి నుంచి అభ్యంతరం చెబుతూ బీజేపీ కుట్రలను బట్టబయలు చేస్తున్నారని వివరించారు. మహారాష్ట్ర, మహాబలిపురంలో ఓటర్ల తొలగింపులో బీజేపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. ఢిల్లీ వేదికగా జంతర్‌మంతర్ వద్ద ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్‌గాంధీ ఉద్యమించారని, పోలీసులు, మిలటరీ సాయంతో బీజేపీ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని, ఆయన రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో నవంబరు 1న రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. మనకంటే ఎంతో అభివృద్ధి చెందిన యూఎస్‌ఏ, యూకే లాంటి దేశాల్లోనే ఈవీఎంలు సరికాదని, బ్యాలెట్ విధానాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో కుత్భుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ, కౌన్సిలర్లు శ్రీశైలం, వెంగల లక్ష్మీనర్సయ్య, పార్టీ నాయకులు గడ్డం నర్సయ్య, ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య, చిలుక రమేశ్, సంగ స్వామి యాదవ్, జిల్లాలోని వివిధ మండలాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.


