ఇండోనేషియా ఆర్ట్‌ ప్రదర్శనకు ఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ | - | Sakshi
Sakshi News home page

ఇండోనేషియా ఆర్ట్‌ ప్రదర్శనకు ఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ

Oct 24 2026 12:10 AM | Updated on Oct 24 2026 12:10 AM

రామగిరి: జేఎన్‌టీయూ కాంట్రాక్ట్‌ అధ్యాపకుడు, ప్రముఖ త్రీడీ ఆర్టిస్ట్‌ సింగారపు శివరామకృష్ణ (ఎస్‌ఎస్‌ఆర్‌ కృష్ణ)కు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశం లభించింది. ఇండోనేషియాలోని యోగ్యకార్త నగరంలో అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 10 వరకు నిర్వహించనున్న ‘అక్షర – నుసంతరా అండ్‌ దునియా’ అంతర్జాతీయ ఆర్ట్‌ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా, క్యూరేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇండోనేషియా ప్రభుత్వ మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 20 దేశాలకు చెందిన 175 మంది కళాకారులు రూపొందించిన 272 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ‘ప్రపంచ లిపుల చారిత్రక వారసత్వం’ ఇతివృత్తంగా ఈ ప్రదర్శన జరగనుంది. ఎస్‌ఎస్‌ఆర్‌ కే అకాడమీకి చెందిన కృష్ణ శిష్యులు 17 మంది రూపొందించిన చిత్రాలు కూడా ఎంపికయ్యాయి. కృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన త్రీడీ ఆర్ట్‌ను రెండు వారాలపాటు ప్రదర్శించనున్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు, మిత్రుడు మియోస సెప్టకు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రదర్శనకు ఎంపికై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement