సిరిసిల్ల: కలెక్టరేట్‌లో గురువారం పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ పండుగ సాయన్న ముదిరాజ్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాల వేసి నివాళి అర్పించారు. డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, జిల్లా సహకారశాఖ అధికారి రామకృష్ణ, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, సంఘం ప్రతినిధులు పర్శ హన్మాండ్లు, కోడి అంతయ్య, కరుణాల భద్రాచలం, బొజ్జ కనకయ్య పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ ఆఫీస్‌లోనూ..
జిల్లా పోలీస్ ఆపీస్‌లోనూ పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే, ఎస్బీ సీఐ రవి, ఆర్‌ఐ రమేశ్, ఎస్సై కిరణ్, ఆర్‌ఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


