సిరిసిల్లటౌన్: శ్రీశాల శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి వారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం గరుడ, హన్మంత వాహన సేవలపై ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు గరుడవాహనంపై మాఢవీధుల్లో విహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మాడంరాజు కృష్ణమాచార్యులు వాహన సేవల విశిష్టత వివరించారు. ఆలయ ఈవో మారుతిరావు, అర్చకులు బీట్కూరి నవీన్, జయవర్ధన్, సుకుమార్, రంగాచారి, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, వికాస తరంగిణి సభ్యులు నాయిని మంగ, పెద్ది శ్రీనివాస్, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


