● సస్పెన్షన్ అయిన వారికి సముచిత స్థానాలు ● కాసుల మాటున పోస్టింగ్‌లు
సిరిసిల్ల: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ)లో బదిలీలు కలకలం రేపాయి. ధాన్యం కొనుగోళ్లలో పొరపాటు చేశారని నాలుగు నెలల క్రితం సస్పెన్షన్‌కు గురైన వారికి తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వడంలో పైరవీలకు తెరలేచిన ట్లు చర్చలు జోరందుకున్నాయి. వీర్నపల్లి ఏపీఎం దేవరాజు ధాన్యం కొనుగోలు వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురికాగా.. తిరిగి గంభీరావుపేట ఏపీఎంగా పోస్టింగ్ ఇచ్చారు. కోనరావుపేట ఏపీఎంగా పనిచేస్తూ ట్రక్‌షీట్ల జారీలో తప్పులు దొర్లాయని సస్పెన్షన్‌కు గురైన రాజేశంను ఇల్లంతకుంటలో తిరిగి నియమించా రు. సస్పెన్షన్‌కు గురైన కోనరావుపేటలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీదేవిని కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ ఆఫీస్‌లోనే పోస్టింగ్ ఇచ్చారు.
ఫలించిన పైరవీలు
సస్పెన్షన్ వేటుపడ్డ వారిని తిరిగి ఉద్యోగాల్లో తీసుకోవడంపై అభ్యంతరం లేకపోగా.. మంచి పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేయడం వివా దాస్పదంగా మారింది. డీఆర్‌డీఏ ఆఫీస్‌లో పనిచేసే ఓ ముఖ్య అధికారి సదరు ఉద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని మంచి పోస్టింగ్‌లు ఇప్పించినట్లు తెలిసింది. కోరుకున్న పోస్టింగ్‌ల కోసం కాసుల భేరాలు సాగించినట్లు సమాచారం. సస్పెన్షన్‌కు గురై తిరిగి పోస్టింగ్‌లు పొందిన ఆ ముగ్గురికి స్థానాలు కల్పించేందుకు మరో నలుగురిని బదిలీ చేసినట్లు సమాచారం. గంభీరావుపేట ఏపీఎం ఎం.జయసుధకు సొంతూరైన వేములవాడలో పోస్టింగ్ ఇ చ్చారు. వేములవాడ ఏపీఎం జె.సుదర్శన్‌ను కోనరావుపేటకు, వేములవాడ రూరల్‌లో ఏపీఎం రాజును ముస్తాబాద్‌కు బదిలీ చేశా రు. ఇల్లంతకుంటలో పనిచేసే కుమారస్వామిని వీర్నపల్లి మండలానికి బదిలీ చేశారు.
పనిష్‌మెంట్ ఎవరికీ ?!
సస్పెన్షన్ వేటుకు గురై తిరిగి ఉద్యోగాలు పొందిన వారికి సముచిత స్థానాలు కల్పించేందుకు అప్పటికే పనిచేస్తున్న వారికి స్థానచలనం కలిగించడం చర్చనీయాంశమైంది. పనిష్‌మెంట్ ఎవరికి ఇచ్చినట్లు అని ఆఫీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పాఠశాల విద్యార్థులకు రోబోటిక్స్ ఏఐ విద్య
వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం మల్లారంలో విద్యాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా విద్యనందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించనున్నట్లు సర్పంచ్ సంగెం అర్పిత–వీరారెడ్డి తెలిపారు.
రోబోటిక్స్ ఏఐ విద్య
నెక్ట్స్ 360 ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గూగుల్ సెర్చ్ ప్రాజెక్టు మేనేజర్ సహకారంతో విద్యార్థుల కోసం ఐదు కంప్యూటర్లను మల్లారం ప్రభుత్వ పాఠశాలకు అందజేయనున్నారు. లాజిక్ జెన్ కంపెనీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత ఏఐ, రోబోటిక్స్ బుక్స్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను టెక్నాలజీరంగం వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటన
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్: ఎల్లారెడ్డిపేట, ము స్తాబాద్ మండలాల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ టీమ్ గురువారం పర్యటించింది. ఎక్స్‌పర్ట్ బృందం చైర్మన్ విజయ్‌దేశాయ్ ము స్తాబాద్ పెద్దచెరువు, బండలింగంపల్లిలోని చెక్‌డ్యామ్ వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలోని రిజర్వాయర్లను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇస్తామని కమిటీ చైర్మన్ దేశాయ్ పే ర్కొన్నారు. రిటైర్డు సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్‌ఈ రమేశ్, ఈఈలు ప్రశాంత్, ప్రశాంత్, డీఈలు నర్సింగ్, శ్రీనివాస్, ఏఈలు భాస్కర్‌రెడ్డి, నవీ న్, సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఉన్నారు.
254 కొనుగోలు కేంద్రాలు
సిరిసిల్ల అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి 254 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి తనూజ తెలిపారు. ఐకేపీ ద్వారా 123, పీఏసీఎస్ ద్వారా 125, మెప్మా ద్వారా 6 కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సన్న ధాన్యం బోనస్ కూడా అర్హులైన రైతులకు అందించనున్నట్లు తెలిపారు.


