శుక్రవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 23 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 22 2026 11:51 PM | Updated on Oct 22 2026 11:51 PM

న్యూస్‌రీల్‌

ఇది సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద ప్రభుత్వ భూములు. 2014 కంటే ముందు ఈ భూములను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ రెండో బైపాస్‌రోడ్డు రగుడు నుంచి వెంకటాపూర్‌ వరకు నిర్మాణం కావడంతో ఈ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. ఎకరం రూ.కోట్లలోకి వెళ్లింది. పెద్దూరు శివారులోని ప్రభుత్వ భూములను పట్టాలు పొందిన పెద్దలు కొందరు అమ్ముకున్నట్లు సమాచారం. కొందరి వద్ద ప్రభుత్వమే మళ్లీ పరిహారం చెల్లించి వాపస్‌ తీసుకుంది. సర్కారు భూముల పట్టాలు.. పరిహారం పంపిణీలోనూ భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పెద్దూరు భూములపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇది తంగళ్లపల్లి మండలంలోని ప్రభుత్వ భూములు. ఇందులో అక్రమంగా సాగుచేస్తున్నారు. ఈ మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూ అధికారులు అప్పటి అధికార పార్టీ నేతలకు పట్టాలు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఒక్కో ఎకరానికి రూ.లక్ష చొప్పున వసూలు చేస్తూ అప్పటి రెవెన్యూ అధికారులు పట్టాల రూపంలో ధారాదత్తం చేశారు. ఇలా పట్టాలు పొందిన వారిపై 2024లో అప్పటి కలెక్టర్‌, ప్రస్తుత జనగామ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా పోలీస్‌ కేసులు నమోదు చేయించి, జైలుకు పంపించారు. కొందరు స్వచ్ఛందంగా భూములు వెనక్కి ఇచ్చారు. ఇంకా మిగిలిన, పరాధీనమైన ప్రభుత్వ భూములపై రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement