ఎల్లారెడ్డిపేట: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన స్వగ్రామం ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో పాల్గొన్నారు. శమీపూజ చేసి, గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
17వ బెటాలియన్‌లో ఘనంగా దసరా వేడుకలు
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్ధాపూర్‌లో గల 17వ బెటాలియన్‌లో విజయదశమి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ ఛటర్జీ ఆధ్వర్యంలో దుర్గాదేవికి పూజలు చేశారు. ఆయుధాలు, పోలీసు వాహనాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ పరికరాలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జమ్మిచెట్టుకు పూజులు నిర్వహించారు. అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాస్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్న్‌షిప్‌తో వృత్తి నైపుణ్యాలు
ముస్తాబాద్: హైస్కూల్ స్థాయిలో విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌తో వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునే అవకాశం ఉందని జిల్లా ఒకేషనల్ కోర్సు కోఆర్డినేటర్ అఖిల్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్‌స్కూల్ విద్యార్థులు దసరా సెలవుల్లో బ్యూటీషియన్ కోర్సుపై ఇంటర్న్‌షిప్ చేయడం అభినందనీయమన్నారు. ముస్తాబాద్‌లో బ్యూటీషియన్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులతో మంగళవారం మాట్లాడారు. శిక్షణతో మెరుగైన వృత్తి నైపుణ్యాలు వస్తాయన్నారు. ఇన్‌స్ట్రక్టర్లు కూర శ్రావణి, భవాని ఉన్నారు.
అంబులెన్స్‌లో ప్రసవం
గంభీరావుపేట: మండలంలోని కొత్తపల్లికి చెందిన ఓ గర్భిణీకి పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే నొప్పులు తీవ్రమయ్యాయి. ఈఎంటీ సాయికృష్ణ, పైలట్ మనోజ్‌కుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అంబులెన్స్ వాహనంలో నే ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రూ.70వేలు పలికిన దుర్గామాత లడ్డూ
ఎల్లారెడ్డిపేట: మండలంలోని కోరుట్లపేటలో దుర్గామాత లడ్డూకు వేలం పాట నిర్వహించారు. సురభి ప్రదీప్‌రావు రూ.70 వేలకు అమ్మవారి లడ్డూను దక్కించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో దుర్గామాతను ఏర్పాటు చేశారు. తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న లడ్డూకు బుధవారం వేలంపాట నిర్వహించగా ప్రదీప్‌రావు దక్కించుకున్నారు. అనంతరం గ్రామస్తులకు లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేశారు.


